ఈ సమస్యలున్నవారు మొక్కజొన్న తినొద్దు.. ఎందుకంటే 

12 July 2024

TV9 Telugu

Pic credit - pexels

వర్షాకాలంలో మొక్కజొన్న పొత్తులను తినడం అంటే చాలా మందికి ఇష్టం. ఈ సీజన్‌లో తరచుగా మొక్కజొన్న పొత్తులను ఉడకబెట్టిన వాటిని లేదా కాల్చిన మొక్కజొన్న పొత్తులను తింటారు.

వర్షాకాలంలో జొన్న పొత్తులు 

మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 

పోషకాలు మెండు 

వరి, గోధుమలా మొక్కజొన్న కూడా ఆహార పంటే.. అయితే జొన్న తినడం కొంతమందికి హానికరం అంటున్నారు డైటీషియన్ పాయల్ శర్మ. ఈ రోజు మొక్క జొన్న తింటే ఎవరికీ నష్టమో తెలుసుకుందాం..

కొంతమందికి హానికరం కూడా 

ఎవరికైనా జీర్ణక్రియ సక్రమంగా లేకపోవడం లేదా మలబద్ధకం వంటి ఏదైనా కడుపు సంబంధిత సమస్యలు ఉంటే మొక్కజొన్న తినకూడదు. ఎందుకంటే దీనిలోని ఫైబర్ హాని కలిగిస్తుంది

జీర్ణక్రియ సమస్యలు 

ఎవరైనా ఏదైనా చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వారు మొక్కజొన్నకు దూరంగా ఉండలి. దీనిలో ఉండే ప్రొటీన్ స్కిన్ సమస్యను పెంచుతుంది

చర్మ సమస్యలు 

 డయాబెటిక్ పేషెంట్ అయితే పొరపాటున కూడా మొక్కజొన్న పొత్తులు తినకూడదు. మొక్కజొన్న తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి

 షుగర్ పేషెంట్స్

బరువు తగ్గాలనుకునేవారు కూడా మొక్కజొన్నపొత్తుని తినకుండా ఉండాలి. ఇందులో పిండి పదార్థాలు, చక్కెర ఉంటాయి. ఇవి బరువును పెంచుతాయి.

బరువు తగ్గలనుకుంటే 

మొక్కజొన్నలో అధిక మొత్తంలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి కనుక వీటిని గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాలి.  

గుండె జబ్బులు

సరిగ్గా ఉడకకుండా పచ్చిగా ఉంటే మాత్రం మొక్కజొన్న పొత్తుని అస్సలు తినకూడదు. పచ్చిగా ఉడకకుండా లేదా కాలకుండా తినడం వలన కడుపునొప్పి, అజీర్ణం, డయేరియా సమస్యలు తలెత్తుతాయి.

పచ్చిగా ఉంటే మాత్రం తినొద్దు