ఈ సమస్యలున్నవారికి పసుపు పాలు విషంతో సమానం.. జాగ్రత్త సుమా..

13 December 2024

Pic credit - Social Media

TV9 Telugu

మన దేశంలో పసుపు పాలకు ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చలికాలంలో దీన్ని తాగేందుకు ఇష్టపడతారు.

పసుపు పాలు

పాలలో అనేక విటమిన్లు , ఖనిజాలు ఉన్నాయి. అయితే పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 

సంపూర్ణ ఆహారం 

కొంతమంది పసుపు పాలు తాగకూడదని పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ అంటున్నారు. కొన్ని ఆరోగ్య పరిస్థితులు దీనికి కారణం అని చెబుతున్నారు. 

నిపుణుల అభిప్రాయం

గర్భధారణ సమయంలో పసుపు పాలను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ఈ పసుపు పాలు గర్భాశయంలో నొప్పి లేదా తిమ్మిరికి కారణం కావచ్చు

గర్భిణీ స్త్రీలు

అపానవాయువు నుంచి గ్యాస్, అజీర్ణం , అతిసారం వరకు సమస్యలు రకరకాల ఉంటే  అప్పుడు పసుపు పాలు తాగవద్దు. మరింత హాని కలుగుతుంది 

జీర్ణకోశ సమస్యలు

పసుపు శరీరం ఇనుమును గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడేవారు కూడా ఈ పాలు తాగకూడదు

ఐరెన్ లోపం ఉంటే 

ఇప్పటికే ఫ్యాటీ లివర్ లేదా కాలేయానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే పసుపు పాలు తాగవద్దు. పసుపులో ఉండే కర్కుమిన్ కాలేయ సమస్యలను పెంచుతుంది.

కాలేయ సమస్య