గ్రీన్ టీని ఈ సమస్యలున్నవారు దూరం పెట్టాల్సిందే.. ఎందుకంటే 

19 September 2024

TV9 Telugu

Pic credit -  Pexels

గ్రీన్ టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శరీరం ఫిట్ గా ఉండాలన్నా.. బరువు తగ్గలన్నా డైట్ లో గ్రీన్ టీ ఖచ్చితంగా చేర్చబడుతుంది.

ఆరోగ్య ప్రయోజనాలు

గ్రీన్ టీలో పుష్కలంగా ఔషధ గుణాలున్నాయి. ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది అధిక రక్తపోటు, అధిక రక్త చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది

ఔషధ గుణాలు

ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ డింపుల్ జాంగ్రా గ్రీన్ టీ గురించి మాట్లాడుతూ.. గ్రీన్ టీని ఎక్కువగా తాగడం వలన కొంత మందికి హానికరంగా మారుతుంది. 

హానికరం కూడా

గ్రీన్ టీలో టానిన్ ఉంటుంది.. ఇది పొట్టలో యాసిడ్‌ని పెంచుతుంది. దీంతో గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వలన ఎసిడిటీ, గ్యాస్ లేదా అజీర్ణం సమస్యను పెరుగుతుంది. 

జీర్ణక్రియ

రక్తహీనతతో బాధపడేవారు గ్రీన్ టీని తీసుకోకూడదు. ఇందులో ఉండే టానిన్‌లు, క్యాటెచిన్‌లు ఐరన్ శోషణను నిరోధిస్తాయి.

రక్తహీనత

మైగ్రేన్ లేదా తరచుగా తలనొప్పి సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీని తీసుకోకూడదు.

పార్శ్వపు నొప్పి

గర్భధారణ సమయంలో కెఫీన్ అధికంగా తీసుకోవడం వల్ల కడుపులోని బిడ్డ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితిలో గ్రీన్ టీ తాగకండి

గర్భిణీ స్త్రీలు 

చాలా మంది రోజును గ్రీన్ టీతో ప్రారంభిస్తారు. ఈ అలవాటు ఆరోగ్యానికి హనికరం. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే ఎసిడిటీ సమస్యకు కారణం అవుతుంది.

ఖాళీ కడుపుతో తాగొద్దు