కాకరకాయను వీరు పొరపాటున కూడా తినకూదట.. ఎందుకంటే 

28 June 2024

TV9 Telugu

Pic credit - pexels

కాకరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు. ఇది చేదుగా అనిపించవచ్చు కానీ చాలా వ్యాధులను దూరం చేస్తుంది.

ఆరోగ్యానికి మేలు

షుగర్ వ్యాధిగ్రస్తులకు కాకరకాయ బెస్ట్ మెడిసిన్. దీన్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది షుగర్‌కే కాదు మలబద్ధకం, గుండె, బరువు తగ్గడం , కొలెస్ట్రాల్‌ నివారణకు కూడా మేలు చేస్తుంది.

వ్యాధుల నుంచి రక్షణ 

శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌ చీఫ్ డైటీషియన్ ప్రియా పలివాల్ మాట్లాడుతూ కాకర కాయను తినడం చాలా ప్రయోజనకరం.. అయితే కొంతమంది ఆరోగ్యానికి హానికరం.

నష్టం కూడా

ఎవరైనా ఫ్యాటీ లివర్ వంటి కాలేయ సంబంధిత వ్యాధి ఉన్నవారు కాకర కాయను తినడం వలన ఆరోగ్యానికి హానిని కలిగించే అవకాశం ఉంది. లివర్ లో ప్రొటీన్ల కమ్యూనికేషన్ నిలిచిపోతుంది. 

కాలేయ సమస్య

గర్భిణీ స్త్రీలు కూడా కాకర కాయను తిన కూడదు. ఎందుకంటే కాకర గింజల్లో ఉండే మెమోర్చరిన్ పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. 

గర్భిణీ స్త్రీలు

కొన్ని సందర్భాల్లో కాకర కాయ పిల్లలకు విరేచనాలు, వాంతుల బారిన పడేలా చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు ఎక్కువగా కాకర కాయ ను పెట్టవద్దు.  

అతిసారం

మధుమేహ వ్యాధిగ్రస్తులు కాకరకాయను ఎక్కువగా తినకూడదు. షుగర్ లెవెల్స్ మీద ప్రభావం పడుతుంది. దీంతో హిమోలిటిక్ అనీమియా వచ్చే ప్రమాదం ఉంది.

షుగర్ వ్యాధిగ్రస్తులు