01 June 2024
TV9 Telugu
Pic credit - getty
ఇష్టమైన ఆహారం కళ్ల ముందున్నప్పుడు తినాలనే కోరికలను అదుపు చేసుకోవడం కష్టం. కడుపు నిండా ఆహారం తీసుకోవడం వల్ల కూడా అజీర్ణం తప్పదు.
తరచుగా కడుపు సమస్యలు, జీర్ణ రుగ్మతలతో బాధపడుతుంటే జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. గ్యాస్, గుండెల్లో మంటతో ఇబ్బంది పడితే యాంటాసిడ్లను ఆశ్రయిస్తారు. అయితే ఇది డేంజర్.
యాంటాసిడ్లను తీసుకోకుండా కూడా అజీర్ణం నివారించవచ్చు. అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండడమే కాదు..కొన్ని సింపుల్ టిప్స్ కూడా మంచి రిజల్ట్ ఇస్తాయి.
గొంతు, ఛాతీ చికాకు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు కొన్ని అల్లం ముక్కలను నమలండి. ఎక్కువ ఆహారాన్ని తింటే అల్లం టీ తాగవచ్చు.
రాత్రి భోజనంగా మటన్, బిర్యానీ తింటే నిద్ర పోయే ముందు చామంతి టీ తాగవచ్చు. ఇది గ్యాస్-గుండెల్లో మంటను నివారిస్తుంది. రాత్రి బాగా నిద్రపడుతుంది.
బేకింగ్ సోడా యాంటాసిడ్ లా పనిచేస్తుంది. బేకింగ్ సోడాను కొద్ది మొత్తంలో నీటిలో కలుపుని తాగడం వలన ఆరోగ్యానికి మేలు.
యాపిల్ సైడర్ వెనిగర్ గుండెల్లో మంటను నయం చేస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తాగితే అజీర్ణం పోతుంది.
ఆహారం తిన్న తర్వాత అజీర్తితో ఇబ్బంది పడుతుంటే కలబంద రసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఇది వాపు, శారీరక అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.