తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చే చిట్కాలు..

20 November 2023

నేటి జీవనశైలి కారణంగా చిన్నవయసులోనే తెల్లజుట్టు వచ్చేస్తుంది. తాత్కాలిక హెయిర్‌ డైలు వేయడం వల్ల జుట్టు పాడవుతుంటుంది. మరేం చేయాలి అని ఆలోచించే వారు ఈ హెయిర్‌ప్యాక్స్‌ వేసి చూడండి

జుట్టుకు పోషణ అందించడంలో ఉసిరి ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనిలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు సెల్యులార్‌ డ్యామేజ్‌ని ఆపి, తెల్ల జుట్టును దూరం చేస్తుంది కూడా

మూడు రెమ్మల కరివేపాకు తీసుకొని అందులో రెండు చెంచాల ఉసిరిపొడి కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని పేస్ట్‌లా చేసుకొని జుట్టుకు అప్లై చేసుకోవాలి

ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుందని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు

బంగాళాదుంపలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటుంది. ఇవి జుట్టును తెల్లజుట్టును నల్లగా మార్చడంలో సాయపడతాయి

ఒక గన్నెలో మూడు చెంచాల చొప్పున బంగాళాదుంప రసం, పెరుగుని తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసుకోవాలి

అరగంట సేపు అలాగే ఉంచుకుని ఆ తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

అలాగే తేయాకు, తులసి ఆకుల్ని సమానంగా తీసుకుని నీళ్లల్లో వేసి మరిగించాలి. చల్లారాక ఆ నీటిని జుట్టుకు పట్టించాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టును నల్లగా మారుస్తుంది