మెదడును పాడు చేసేవి ఇవే.. 

06 February 2024

TV9 Telugu

సుధీర్ఘకాలంగా ఒకేచోట కూర్చొని పనిచేయడం వల్ల మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీనివల్ల మెదడులోని మిడిల్‌ టెంపోరల్ లోబ్‌లో మార్పులకు కారణమవుతుంది.

ఎక్కువ కాలం ఒంటరితనంలో ఉండే వారిలో కూడా మెదడు పనితీరు దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. సామాజికంగా చురుకుగా లేని వారి మెదడు పనితీరు దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. 

నిద్రలేమి కూడా మెదడు ఆరోగ్యాన్ని ప్రాభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజులో కనీసం 7 నుంచి 8 గంటల నిద్రలేకపోతే కచ్చితంగా మెదడు పనితీరు మందగిస్తుందని పరిశోధనల్లో తేలింది. 

నిరంతర ఒత్తిడి మెదడు కణాలను దెబ్బతీస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. జ్ఞాపకశక్తి తగ్గడానికి ఇది దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఒత్తిడిని వీలైనంత వరకు దరిచేరకుండా ఉండాలని సూచిస్తున్నారు. 

ఇక తీసుకునే ఆహారం కూడా మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం వల్ల మెదడు పనితీరు సరిగ్గా పనిచేయదని హెచ్చరిస్తున్నారు. 

ఇక మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజూ కచ్చితంగా నడవడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నడక మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతున్నారు.

ఫ్యాటీ ఫిష్‌, పసుపు, కూరగాయలను ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.