మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీసేవి ఇవే.. 

Narender Vaitla

02 September 2024

నిద్రలేమి సమస్య వల్ల మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేకపోతే మెదడుకు కావాల్సిన విశ్రాంతి లభించదు. 

ఉదయం టిఫిన్‌ మానేసే వారిలోనూ మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి, మెదడుపై దుష్ప్రభావం పడుతుంది.

మెదడులో సుమారు 75 శాతం నీరే ఉంటుంది. కాబట్టి శరీరంలో నీటి శాతం తగ్గితే కచ్చితంగా మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది.

తీవ్రమైన ఒత్తిడితో ఇబ్బంది పడే వారి మెదడుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. దీర్ఘకాలంగా ఒత్తిడి ఉంటే మెదడు పనితీరు దెబ్బతింటుంది.

నిరంతరం హెడ్‌ఫోన్స్‌ ఉపయోగించినా, ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్‌ వింటున్నా వినికిడి లోపంతో పాటు మెదడు కణజాలం దెబ్బతినే అవకాశం ఉంటుందని చెబుతున్నారు

నిత్యం ఒంటరిగా గడిపే వారిలో కూడా మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒంటరితనం వల్ల తలెత్తే డిప్రెషన్‌ మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.

ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లతో గడిపే వారి మెదడుపై ప్రభావం పడుతుందని అంటున్నారు. ముఖ్యంగా చిన్నారలు మెదడు పరిమాణం, అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.