వర్షాకాలంలో ఈ అటవీ ప్రాంతాలు మహా అద్భుతం.. ప్రపంచంలోనే ది బెస్ట్.. 

05 July 2025

Prudvi Battula 

కాజీరంగ నేషనల్ పార్క్, ఇండియా: ఈ ప్రదేశం ఒక కొమ్ము గల ఖడ్గమృగాలకు నిలయం. వర్షాకాలంలో పర్యటనకి అనువైనది.

బివిండి ఇంపెనెట్రబుల్ ఫారెస్ట్, ఉగాండా: ఈ దట్టమైన అడవి గొరిల్లాలకు ప్రసిద్ధి చెందింది. వర్షాకాలంలో అద్భుతంగా ఉంటుంది.

ఖావో సోక్ నేషనల్ పార్క్, థాయిలాండ్: నదులు, ఏనుగులతో నిండిన ఈ పార్క్ వర్షాకాలంలో చాలా పచ్చగా, సజీవంగా ఆకర్షణీయంగా ఉంటుంది.

పాంటనల్ వెట్‌ల్యాండ్స్, బ్రెజిల్: వర్షాకాలం వేళ ఈ ప్రాంతంలో జాగ్వర్లు, పక్షులను చూడవచ్చు. ఇది ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి.

చిట్వాన్ నేషనల్ పార్క్, నేపాల్: వర్షంలో ప్రశాంతమైన అటవీ నడకలను ఆస్వాదిస్తూ.. ఖడ్గమృగాలు, పులులు అనేక పక్షులను చూడవచ్చు.

సింహరాజ అటవీ అభయారణ్యం, శ్రీలంక: ఈ ఉష్ణమండల అడవి అరుదైన మొక్కలు, పక్షులను కలిగి ఉంది. వర్షాకాలంలో ఆహ్లాదకరంగా ఉంటుంది.

రనోమఫానా నేషనల్ పార్క్, మడగాస్కర్: వర్షాకాలంలో అడవి పచ్చదనంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ లెమర్‌లు, ఇతర అరుదైన జంతువులను వీక్షించవచ్చు.

తమన్ నెగరా, మలేషియా: రుతుపవనాల సమయంలో ఈ ప్రాంతం ప్రకాశవంతంగా ఉంటుంది. పులులు, కోతులు, కీటకాలతో నిండిన చాలా పురాతనమైన వర్షారణ్యం.