మామిడిపండుతో కలిపి వీటిని తింటున్నారా .. ఎంత అనారోగ్యమో తెలుసా 

25 May 2024

TV9 Telugu

Pic credit - getty

భారతదేశం నుంచి ప్రపంచం నలుమూలల వరకు మామిడి పండ్లను తినడానికి ఇష్టపడతారు. వేసవి కాలం వస్తే చాలు మామిడి పండు మార్కెట్ లో అడుగు పెట్టె సమయంలో ఎదురుచుస్తారు. 

మామిడి పండు 

మామిడి పండుతో ఎన్నో రకాల కాంబినేషన్ వంటకాలను తయారు చేస్తారు. అయితే కొన్నిసార్లు అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. మామిడిపండుతో కలిపి ఏమి తినకూడదో తెలుసుకోండి.

ఈ కాంబినేషన్స్ 

మామిడి పండుతో పెరుగు, పాలు చాలా సాధారణ కలయిక. ఈ కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది. అయితే ఇలా తింటే జీర్ణం అవడం కొంచెం కష్టం. 

పెరుగు-పాలు

మామిడిపండుతో నారింజ, నిమ్మ మొదలైన పుల్లని పండ్లను కలిపి పొరపాటున కూడా తినవద్దు. దీని కారణంగా శరీరంలోని pH బ్యాలెన్స్‌కు భంగం కలిగే అవకాశం ఉంది.

పుల్లని పండ్లతో 

మీరు మామిడి పండ్లను తింటుంటే ఆ సమయంలో లేదా వెంటనే శీతల పానీయాలు, సోడా లేదా పండ్ల రసాలను తీసుకోకండి.

శీతల పానీయాలతో 

మామిడి పండులో కేలరీలు అధికంగా ఉంటాయి. మామిడి పండుతో కలిపి స్పైసీ హెవీ ఫుడ్ కలిపి తింటే అజీర్ణం చేస్తుంది. అసిడిటీని కలిగిస్తుంది.

స్పైసీ హెవీ ఫుడ్

మామిడి పండు తిన్న వెంటనే నీళ్లు తాగకుండా ఉండాలి. వికారం, వాంతులు, విరేచనాలు మాత్రేమే కాదు.. ఒకొక్కసారి దగ్గు, జలుబుకు కూడా కారణమవుతుంది.

వెంటనే నీరు త్రాగవద్దు