కేరళలో ఈ ఫుడ్స్ టేస్ట్ చేస్తే ఆహా ఏమి రుచి అనాల్సిందే.. 

TV9 Telugu

18 January 2025

పుట్టు అనేది కొబ్బరి షేవింగ్‌లతో వండిన ఒక స్థూపాకార స్టీమ్డ్ రైస్ కేక్. కేరళలో రుచికరమైన ఆహారాల్లో ఇది ఒకటి.

అప్పం కేరళలోని చాలామందికి ఇష్టమైన వంటకం అప్పం. ఏది తిన్నా సరే, అప్పం రుచి రాదన్నది కేరళ ప్రజలు చెబుతారు.

ఇడియప్పం బియ్యం పిండి, నీరు ఉప్పుతో తయారు చేస్తారు. నూలప్పం అని కూడా పిలుస్తారు, ఏదైనా కూరతో తింటే చాలా రుచిగా ఉంటుంది!

నాదన్ కోజి వరుతత్తు అనే స్పైసి చికెన్ ఫ్రై. ఈ చికెన్‌ను ఉల్లిపాయ, వెల్లుల్లి, కారం, వెనిగర్, కొత్తిమీరతో వేయిస్తారు.

కేరళ రొయ్యల కూరలో కారం, ఉప్పు, మిరియాలపొడి చల్లి, కొబ్బరి పాలు, బెల్లం వేసి, చివరగా కరివేపాకుతో ముగిస్తారు.

మలబార్ పరోటా మలబార్ కోస్తా ప్రాంతంలో నోరూరించే వీధి ఆహారం. ఇది కెరలోని అన్ని వయసుల వారికి ఇష్టమైనది.

పలాడ పాయసం అనేది ఓనం పండుగ సమయంలో లేదా మరేదైనా సందర్భంలో తయారుచేయబడిన ఒక సాంప్రదాయ డెజర్ట్. ఇది కేరళలోని అన్ని ఇళ్లలో తయారుచేస్తారు.

అదా ప్రధమన్ సుగంధ ద్రవ్యాలు, గింజలతో కూడిన చాలా తీపి డెజర్ట్, కేరళలోని ఖీర్ల రాజు. వెచ్చని ఆహ్లాదకరమైన వాసనతో రుచిగా ఉంటుంది.