ఎంత అందంగా మేకప్ వేసుకున్నా.. సరైన లిప్‌స్టిక్ ఎంచుకోకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఒంటి ఛాయకు తగిన లిప్ స్టిక్ వేసుకుంటే చుక్కల్లో చందమామలా మెరిసిపోవచ్చు
TV9 Telugu
ప్రతి మహిళ ఖచ్చితంగా లిప్ స్టిక్ ఇష్టపడుతుంది. ప్రత్యేకంగా ఉద్యోగాలు చేసే మహిళలు ఆఫీసుకు వెళ్లేటప్పుడు వారి ముఖానికి మేకప్ వేసుకుంటుంటారు. వీరు ఖచ్చితంగా లిప్‌స్టిక్‌ను కూడా అప్లై చేస్తారు
TV9 Telugu
అయితే చాలా మంది లిప్‌స్టిక్‌ను సరైన మార్గంలో అప్లై చేయరు. పెదవులపై మరే ఇతర ఉత్పత్తిని పూయకుండా లిప్‌స్టిక్‌ను నేరుగా ఉపయోగిస్తారు. అలా చేయడం ప్రమాదకరం అంటున్నారు నిపుణులు
TV9 Telugu
ఇలా ఇతర ఉత్పత్తులు వినియోగింకుండా పెదవుల మీద లిప్‌స్టిక్‌ను ఎక్కువ సేపు అప్లై చేయడం వల్ల అవి నల్లగా మారుతాయి. మరైతే లిప్‌స్టిక్‌ను ఎలా అప్లై చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఇక్కడ తెలుసుకుందాం..
TV9 Telugu
లిప్ స్టిక్‌లలో అనేక రకాల రంగులు, ఫ్లేవర్లు ఉంటాయి. వీటిని తరచూ వినియోగించడం వల్ల పెదాలు పొడిబారడం, నల్లబడడం మొదలవుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
TV9 Telugu
పెదవులపై లిప్‌స్టిక్‌ను అప్లై చేసే ముందు, మొదట పెదాలను స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్బింగ్ చేయడం వల్ల పెదవులపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి
TV9 Telugu
పెదాలను స్క్రబ్ చేసిన తర్వాత దానిపై లిప్ ప్రైమర్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదాలు చాలా కాలం పాటు మృదువుగా ఉంటాయి. తర్వాత పెదవులపై లిప్ బామ్ లేదా మాయిశ్చరైజర్ ఉపయోగించాలి
TV9 Telugu
చివరగా పెదవులపై లిప్‌స్టిక్‌ని అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదాలు నల్లగా మారవు. మొత్తం మేకప్ అయ్యాక ఒక్కసారి టిష్యూ పేపర్‌తో అద్దండి. అదనంగా ఉన్న రంగు పోతుంది