పరీక్షల వేళ చిన్నారులకు.. ఈ ఫుడ్ వద్దే వద్దు.
25 January 2024
TV9 Telugu
చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులకు చక్కెర తక్కువగానే ఇవ్వాలని.
పిండి పదార్థాలు కూడా మెదడు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందనేది నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా మైదా పిండిని తగ్గించాలని చెబుతున్నారు.
అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే ఇన్‌ఫ్లమేటరీ డైట్ ప్యాటర్న్‌లు బలహీనమైన జ్ఞాపకశక్తిని కలుగజేస్తాయి.
ఇక పిల్లలు ఎంతో ఇష్టపడి తాగే కూల్ డ్రింక్స్ వల్ల టైప్ 2 డయాబెటిస్ సమస్యతో పాటు బ్రెయిన్ పైన ప్రతికూలమైన ఫలితాలనిస్తాయి.
చిప్స్, స్వీట్లు, ఇన్‌స్టెంట్ నూడుల్స్ వంటివి తీసుకోవడం వల్ల మెదడుపై దుష్ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇక మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే.. ఒమేగా -3 కలిగిన ఆహార పదార్ధాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చేపలు తీసుకోవాలి.
అలాగే పచ్చి ఆకుకూరలు, పండ్లు మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల మెదడుకు మేలు జరుగుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..