‘విటమిన్‌ బి-12’ లోపించిందా..! వీటిని తినేయండి

29 September 2024

TV9 Telugu

TV9 Telugu

మండే ఎండలో శరీరానికి చలువనిచ్చే కీరా దోస.. ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది. ఈ దోసకాయ వల్ల శరీరంలోని విషతుల్యాలు తొలగిపోవడంతో పాటు చెడు కొవ్వు తగ్గి బరువు కూడా అదుపులో ఉంటుంది

TV9 Telugu

ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలతోపాటు ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు కూడా శరీరానికి అవసరమే. అటువంటి ముఖ్యమైన విటమిన్లలో విటమిన్‌ బి12 ఒకటి

TV9 Telugu

శరీరంలో విటమిన్ B12 లోపం వల్ల రక్తహీనత అంటే.. చేతులు, కాళ్లలో నొప్పి, బలహీనత, మానసిక సమస్యలు వస్తాయి. వీటి నివారణకు విటమిన్‌ బి12 అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి

TV9 Telugu

విటమిన్ బి12 శరీరంలో ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఎముకలు, కండరాలను బలపరుస్తుంది. మెదడుకు పదునుపెడుతుంది

TV9 Telugu

శరీరంలో విటమిన్ బి12 స్థాయిని పెంచుకోవడానికి కొన్ని ముఖ్యమైన ఆహారాలు తీసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో బి12 స్థాయిని పెంచుకోవచ్చు

TV9 Telugu

 విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి పుట్టగొడుగులను కూడా తినవచ్చు. ఇందులో అధిక మొత్తంలో B12 ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్ డి, పొటాషియం , అనేక యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అలాగే రోజూ ఒక కప్పు పాలు తాగడం వల్ల విటమిన్‌-12ను శరీరానికి అందించవచ్చు

TV9 Telugu

బీట్‌రూట్ తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ బి12 లోపాన్ని అధిగమించవచ్చు. ఇందులో మంచి మొత్తంలో బి12, ఐరన్, పొటాషియం, కాల్షియం ఉంటాయి

TV9 Telugu

పాకూరలో అధిక మొత్తంలో విటమిన్ బి12 ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ బి12 స్థాయిని కూడా పెంచుకోవచ్చు. కూరగాయలే కాకుండా సలాడ్‌గా కూడా తినవచ్చు