ఇంట్లోకి పాములు రాకూడదా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి మరి!

Samatha

29 August  2025

Credit: Instagram

పాములను చూస్తేనే చాలు చాలా మంది వణికిపోతుంటారు. మరి అవి ఇంటికి వస్తే .. ఆ ఊహనే భయంగా ఉంది కదా!

కానీ వర్షాకాలంలో చాలా వరకు పాములు ఇంట్లోకి వస్తుంటాయి. అందుకే అవి ఇంటికి రాకుండా ఉండాలంటే, తప్పకుండా కొన్ని టిప్స్ పాటించాలంట. 

పాములు ఇంటిలోకి రాకుండా ఉండాలంటే, ముందుగా మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలంట. అప్పుడే ఇంటిలోపలికి పాములు రావు.

మీ ఇంటి చుట్టూ, చెత్తా చెదారం, కలప, పెద్దగా పెరిగిన చెట్లు, గుబురుగా ఉండే చెట్లు, పొదలు లాంటివి ఉండకుండా చూడాలంట.

చెట్లను చిన్నగా నరికి వేయడం, మొక్కలు వేపుగా లేకుండా చిన్నగా కట్ చేయాలంట. ఇంటి చుట్టూ ఏవైనా అనవసర మొక్కలు ఉంటే వాటిని తొలిగించాలంట.

అలాగే తలుపులు, కిటికీలు, వెంట్లు, ప్లంబింగ్ హోల్స్ వంటివి ఉంటే వాటిని తనిఖీ చేయాలంట. ముఖ్యంగా వర్షాకాలంలో వీటిని మూసి వేయాలంట.

అదే విధంగా వర్షాకాలం చిన్న చిన్న కీటకాలు, కప్పలు ఇంటిలోపలికి ఎక్కువగా వస్తుంటాయి. దీంతో వాటి ఆహారం కోసం పాములు వస్తుంటాయి.

అందుకే కీటకలు, కప్పలు ఇంటిలోకి రాకుండా చూసుకోవాలి. అలాగే ఎలుకలు అస్సలే ఇంటిలోపల ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలంట. లేకపోతే పాములు వచ్చే ప్రమాదం ఎక్కువ.