సంతోషంగా జీవించాలా.? జీవితంలో ఇవి నేర్చుకోండి 

15 September 2023

ప్రతీ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ప్రతీదీ మనకు నచ్చినట్లే జరగాలని రూల్‌ ఉండదనే సత్యాన్ని గుర్తించాలి. 

వ్యక్తిగతంగా తీసుకోకూడదు

ఎదుటి వ్యక్తులపై ఈర్ష్యను వీలైనంత త్వరగా వదిలేయండి. వీలైతే వారిలా ఎలా అభివృద్ధి చెందాలని ఆలోచించాలి కానీ అసూయపడితే మీ మానసిక ఆనందం దూరమవుతుంది. 

అది వదిలేయండి.. 

ఇతరులు మీకు అన్యాయం చేశారు, ఇతరులు మిమ్మల్ని బాధపెట్టారని.. ఆ కోపాన్ని మరొకరిపై చూపించకూడదు. ఇది కూడా మీ మానసిక ఆనందాన్ని దెబ్బతీస్తుంది. 

మరొకరిపై చూపించకండి.. 

మిమ్మల్ని తక్కువ చేసి చూసే వారిని, మిమ్మల్ని ఎప్పుడూ నిరూత్సాహపరిచే వారిని మీకు దూరంగా ఉండేలా చూసుకోండి. 

వారికి దూరంగా ఉండాలి. 

వీలైనంత వరకు మీకు నచ్చిన పనినే చేయడానికి ప్రయత్నించండి. నచ్చిన పని చేయడంలో ఉన్న సంతోషం మరోటి ఉండదని గుర్తించండి. 

నచ్చిన పనినే చేయండి.. 

జీవితం అన్న తర్వాత మంచి, చెడు రెండు జ్ఞాపకాలు ఉంటాయి. అయితే పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం మానేయాలి. 

వాటిని మర్చిపోండి.. 

మనసులోకి నెగిటివ్‌ ఆలోచలను రానివ్వకుండా చూసుకోవాలి. నెగిటివ్‌ ఆలోచనలు మనిషిని ముందుకు సాగనివ్వవు. సంతోషాన్ని దూరం చేస్తాయి. 

అవి రాకుండా చూసుకోండి.. 

సంతోషంగా ఉండాలంటే ముందుగా మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం మానేయాలి. మీ సంతోషానికి మొదటి మెట్టు ఇదేనని గుర్తించాలి

సంతోషానికి మొదటి మెట్టు ఇదే..