కాళ్లు, చేతులు తిమ్మిర్లా.. ఇదే కారణం
27 January 2024
TV9 Telugu
దీర్ఘకాలంగా కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
దీనికి కారణంగా శరీరంలో సరిపడ విటమిన్ బీ12 లేకపోతే ఇలాంటి సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
విటమిన్ బీ12 లోపాన్ని జయించడానికి ఆహారంలో కచ్చితంగా పాలు, పెరుగును భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పులిసిన మజ్జిగ తీసుకోవాలి.
ఇక బీ12 లోపాన్ని సరిచేయడానికి మాంసాహారం కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. వారంలో రెండు సార్లు చికెన్ లేదా మటన్ తీసుకోవాలని చెబుతున్నారు.
నిత్యం ఆహారంలో చేపలు, గుడ్లను భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల విటమిన్ బీ12 లోపాన్ని సరిచేయవచ్చు.
ఇక ఆకు కూరలు కూడా బీ12 లోపాన్ని తగ్గిస్తుంది. మరీ ముఖ్యంగా ఆహారంలో పుట్టగొడుగులను భాగం చేసుకోవడం వల్ల లోపాన్ని జయించవచ్చు.
డ్రై ఫ్రూట్స్ కూడా విటమిన్ బీ12 లోపాన్ని జయించడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పిస్తా, బాదంను ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..