మీలో ఈ లక్షణాలు ఉన్నాయేమో చూసుకోండి.. 

14 september 2023

బీ12 లోపం ఉన్న వారిలో చర్మం పసుపు రంగులోకి మారడాన్ని గమనించవచ్చు. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే టెస్ట్‌ చేయించుకోవాలి. 

ఇక బీ12 లోపం ఉన్న వారిలో తొలుత నాలుక మొత్తం ఎరుపు రంగులోకి మారిపోతుంది. అంతేకాకుండా నాలుక నొప్పిగా కూడా ఉంటుంది. 

బీ12 లోపాన్ని ముందుగా గుర్తించే మరో లక్షణం నోటి పూత. ఈ లోపంతో బాధపడుతోన్న వారి నోట్లో విపరీతంగా పూత కనిపిస్తుంది. 

బీ12 లోపంతో బాధపడే వారు ఇట్టే అలసి పోతారు. ఎక్కువ సేపు నడవలేరు, కొద్ది దూరం నడవగానే తీవ్రంగా అలసిపోతుంటారు. 

ఇక కళ్ల సమస్యలు కూడా వేధిస్తుంటాయి. బీ12 లోపం కారణంగా దృష్టి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

బీ12 లోపం మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లోపంతో బాధపడే వారు ఎప్పుడు చిరాకుగా ఉంటారు. 

ఇక బీ12 లోపం ఉన్న వారిలో కనిపించే మరో ప్రధాన లక్షణం డిప్రెషన్‌. ఏ కారణం లేకపోయినా ఏదో జరిగినట్లు ఊహించుకుంటారు. 

పైన తెలిపిన అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.