అస్సలు లైట్ తీసుకోకండి..ఇవి కూడా థైరాయిడ్ లక్షణాలే
Narender.Vaitla
శరీంలో ఉన్నట్లు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతుంటే థైరాయిడ్ సమస్య ఉందని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ హార్మోన్లు పడిపోయినప్పుడు శరీరంలో కొలెస్ట్రాల్‌ను విడగొట్టలేదు.
ఇక హైపోథైరాయిడిజమ్ వల్ల శరీరంలో రక్త పరిమాణం తగ్గుతుంది. దీంతో గుండె కండర సంకోచాలు బలహీనమవుతాయి. గుండె వేగం నెమ్మదిస్తుంది ఇవి గుండె సమస్యలకు కారణమవుతాయి.
థైరాయిడ్ హార్మోన్లలో మార్పులు జీర్ణక్రియపై కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. థైరాడియ్ తగ్గితే పేగుల కదలికలు నెమ్మదిస్తాయి. ఫలితంగా మలబద్ధకం తలెత్తుతుంది.
కీళ్లు, కండరాల నొప్పులు కూడా థైరాయిడ్ సమస్యకు సంకేతం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాళ్లలోని పెద్ద కండరాల నొప్పులు తలెత్తుతుంటాయి.
థైరాయిడ్ పనితీరు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. చిన్న వయసులో థైరాయిడ్ పనితీరు తగ్గిన వారిలో డిప్రెషన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.
జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత కుదరకపోవడం కూడా హైపోథైరాయిడిజమ్ లక్షణాలు కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం పడడమే దీనికి కారణంగా చెప్పొచ్చు.
అధికంగా జుట్టు రాలడం, నిత్యం అలసగా ఉండడం, ముఖం మీద వాపు కూడా హైపో థైరాయిడిజంకు ముందస్తు లక్షణమని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.