TV9 Telugu

23 March 2024

ఈ లక్షణాలుంటే.. వడదెబ్బ తగిలినట్లే. 

ఎండదెబ్బను త్వరగా గుర్తించి, చికిత్స తీసుకుంటే సమస్య తీవ్రతరం కాకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎండదెబ్బ తగిలితే మైకంతో పాటు తలతిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలని చెబుతున్నారు.

ఇక మరికొందరిలో ఎండదెబ్బ తగిలిన సమయంలో తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంది. ఎన్ని ట్యాబ్లెట్స్‌ వేసుకున్నా తల బద్ధలైనట్లు అనిపిస్తుంది.

ఇక ఎండదెబ్బ తగలడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురి అవుతుంది. దీంతో ఏకాగ్రతను కోల్పోతారు, ఏ పనిపై దృష్టి సారించలేకపోతారు.

ఎండదెబ్బ తగిలిన వారిలో కనిపించే మరో ప్రధాన లక్షణలం.. బలహీనత, కండరాల నొప్పి కూడా ఒకటి. దీనికి కూడా డీహ్రైడేషన్‌ ప్రధాన కారణం.

ఇక ఎండదెబ్బ తగిలితే కనిపించే మరో లక్షణం.. విపరీతమైన దాహం, అలాగే కడుపులో తిప్పుతున్న భావన కలుగుతుంది.

మరికొందరిలో వాంతులు, విరేచనలు, అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే ఎండ దెబ్బ తగిలిన వారికి ద్రవాలు ఇవ్వాలని చెబుతున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.