ఎలాంటి కారణం లేకుండా నిత్యం కోపానికి గురైతుంటే ఒత్తిడితో బాధపడుతున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఓపిక లేకపోవడం చిన్న వాటికి అరవడం కూడా ఒత్తిడి లక్షణాలుగా చెప్పొచ్చు.
నిత్యం నిరాశతో ఉండడం, ఏదో తెలియని ఆందోళన, గుండెదడ వంటి లక్షణాలు కూడా ఒత్తిడి ప్రాథమిక లక్షణాలుగా భావించాలని నిపుణులు చెబుతున్నారు
ఒత్తిడి ఉన్న వారిలో ఎదురయ్యే మరో ప్రాథమిక లక్షణం నిద్రలేకపోవడం. ఒత్తిడితో చిత్తవుతున్న వారు నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు.
ఒత్తిడి కారణంగా శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది ఇది శరీరంలో పలు మార్పులకు నాంది పలుకుతుంది. ముఖ్యంగా నిత్యం నీరసంగా ఉంటారు.
ఆకలి తగ్గడం, బరువులో మార్పులు కూడా ఒత్తిడి ముఖ్యకారణమని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం ఒత్తిడితో బాధపడేవారిలో ఈ సమస్యలు ఉంటాయి.
ఏ కారణంగా లేకుండా తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంటే అది కూడా ఒత్తిడికి కారణమని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలికంగా తలనొప్పి ఉంటే ఒత్తిడితో బాధపడుతున్నట్లే అర్థం చేసుకోవాలి.
ఒత్తిడిని నుంచి బయట పడాలంటే జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా యోగా, మెడిటేషన్ వంటివి అలవాటు చేసుకోవాలి. అదే విధంగా తీసుకునే ఆహారంలో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.