17 June 2024

ఈ లక్షణాలుంటే.. అయోడిన్‌ లోపించినట్లే 

Narender.Vaitla

ఉన్నపలంగా బరువు పెరిగితే శరీరంలో అయోడిన్‌ లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అయోడిన్‌ తక్కువగా ఉంటే మెటబాలిజం తగ్గుతుంది. దీంతో జీర్ణక్రియ సరిగ్గా జరగక బరువు పెరుగుతారు.

నిత్యం అలసటగా లేదా నీరసంగా ఉంటే శరీరంలో అయోడిన్‌ లోపించినట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బాగా చిరాకుగా ఉన్నా అయోడిన్‌ లోపించినట్లే.

శరీరానికి కావాల్సిన అయోడిన్‌ లభించకపోతే జుట్టు ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అయోడిన్‌ లోపిస్తే జుట్టు ఎక్కువగా రాలిపోతు ఉంటుంది.

శరీరంలో అయోడిన్‌ స్థాయిలు తగ్గితే హైపో థైరాయిడిజజం సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయనిన నిపుణులు చెబుతున్నారు. కాబట్టి థైరాయిడ్‌కు అయోడిన్‌కు మధ్య సంబంధం ఉంటుంది.

అయోడిన్‌ లోపిస్తే చర్మ ఆరోగ్యంపసై కూడా ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. చర్మం పొడిబారినా, దురద వంటి సమస్య వేధించిన చర్మం త్వరగా పాలిపోతుంది.

నిత్యం కళ్లు తిరుగుతున్న భావన కలిగినా, గుండె వేగం పెరిగినట్లు ఉంటున్నా అయోడిన్‌ లోపం ఉన్నట్లే. దీర్ఘకాలంగా ఈ సమస్య వేధిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

మెదడు పనితీరును అయోడిన్‌ ప్రభావవితం చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే శరీరంలో అయోడిన్‌ లోపిస్తే మెదడు పనితీరు దెబ్బ తింటుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.