TV9 Telugu

22 March 2024

మనసా.. క్షేమమా.? 

డిప్రెషన్‌లోకి జారుకున్న వారు దీర్ఘ‌కాలం ఏదో ఒక బాధలో ఉంటారు. తమ కష్టాలను ఇతరులకు తెలియజేయకుండా తమలో తామే కుంగిపోతుంటారు.

ఎప్పుడూ చూసిన ఏడుస్తున్నట్లే కనిపిస్తారు. అసలు చిరునవ్వు అనేదే ఉండదు. ఎంతటి సంతోషకరమైన సమయంలోనూ బాధగా ఉంటారు. 

ఇక డిప్రెషన్‌తో బాధపడేవారిలో నిత్యం నిరాశ ఆవహిస్తుంది. దేనిని సరిగ్గా ఆస్వాదించరు, ఎప్పుడూ బాధలోనే ఉంటారు.

డిప్రెషన్‌లో ఉన్న వారు నిత్యం ఏదో కోల్పోయామన్న భావనలో ఉంటారు. ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు

చిన్న చిన్న విషయాలకే చిరాకు పడుతుంటారు. నిత్యం కోపంతో ఊగిపోతుంటారు. ఎదుటి వారితో మాట్లాడ్డానికి కూడా ఇష్టపడరు. 

డిప్రెషన్‌తో బాధపడేవారు త్వరగా స‌హ‌నం కోల్పోతుంటారు. ఇష్టపడే పనులను కూడా ఆస్వాదించలేకపోతారు.

నిత్యం ప్రతికూల ఆలోచనలు చేయడం, ఏ పనిపై ఏకాగ్రత చేయలేకపోవడం కూడా డిప్రెషన్ లక్షణాలుగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.