మీ మానసిక ఆరోగ్యం బాగానే ఉందా.? ఇలా చెక్ చేసుకోండి..
15 October 2023
మారుతోన్న జీవన విధానం కారణంగా ఇటీవల మానసిక అనారోగ్యం బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. సైకియాట్రిస్ట్‌లను సంప్రదిస్తున్న వారు కూడా పెరుగుతున్నారు.
మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అయితే మానసిక అనారోగ్యాన్ని గుర్తించేందుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి.
ఆకలికి, మానసిక ఆరోగ్యానికి సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. పూర్తిగా ఆకలి లేకపోయినా, పదే పదే తినాలి అనిపించినా అది మానసికర అనారోగ్యమేనని నిపుణులు చెబుతున్నారు.
నిద్రలేమి కూడా మానసిక అనారోగ్యాన్ని సూచిస్తుంది. ఇక రాత్రంతా సరిపడ నిద్ర ఉన్న తర్వాత కూడా తీవ్ర అలసటగా అనిపిస్తే సదరు వ్యక్తి కచ్చితంగా మానసిక ఆనారోగ్యంతో బాధపడుతున్నట్లే.
ఆలోచన శక్తి కోల్పోవడం కూడా మానసిక అనారోగ్య లక్షణంగా నిపుణులు భావిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలకు కూడా తీవ్రంగా ఆలోచించినా, అసలు ఆలోచన శక్తిని కోల్పోయినా రెండూ మానసిక అనారోగ్యానికి సూచనే.
ఇక చిన్న చిన్న అపజాయలకు కూడా కుంగిపోతుంటే కచ్చితంగా అది మానసిక అనారోగ్యంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఆత్మననూన్యత భావం ఎక్కువ కాడం వంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయి.
ఆరోగ్యకరైన సంబంధాలు లేకపోవడం కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. విచ్ఛిన్నైన కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు కూడా మానసిక అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
నిత్యం ఒంటరితనంలో గడపడం, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడే వారు కూడా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి హాబీలు లేకపోవడం కూడా మానసిక అనారోగ్యానికి కారణమవుతుంది.