రక్తహీనత తగ్గిపోవాలంటే తాగాల్సిన స్పెషల్ జ్యూస్ లు ఇవే!

Samatha

2 august  2025

Credit: Instagram

మహిళల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో రక్త హీనత ఒకటి. శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గడం వలన రక్తహీనత సమస్య వస్తుంటుంది.

దీంతో రక్తహీనత వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే హిమోగ్లోబిన్ పెంచి రక్త హీనతను తగ్గించుకోవాలంటే కొన్ని జ్యూస్ లు తాగాలంట.

శరీరానికి మేలు చేసే జ్యూస్ లలో దానిమ్మ జ్యూస్ ఒకటి. ఇందులో ఐరన్, విటమిన్ సి వంటివి ఎక్కువగా ఉంటాయి. అందువలన రోజూ మార్నింగ్ దానిమ్మ జ్యూస్ తాగితే రక్త హీనత తగ్గుతుందంట.

శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో బీట్ రూట్ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వలన ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరిగి, రక్తహీనత తగ్గుతుందంట.

చెరుకు రసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుందంట.

క్యారెట్, బీట్ రూట్, టమాటో జ్యూస్. శరీరానికి చాలా మంచిది. ప్రతి రోజూ ఈ జ్యూస్ తాగడం వలన శరీరంలో రక్తం పెరిగి, రక్తహీనత తగ్గిపోతుందంట.

ఉసిరి జ్యూస్ శరీరానికి చాలా మంచిది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వలన ఇది రోగనిరోధక శక్తి పెంచుతుందంట.

ఆపిల్ జ్యూస్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, ఐరన్ ఎక్కువగా ఉండటం వలన ప్రతి రోజూ ఆపిల్ జ్యూస్ తీసుకోవడం చాలా మంచిదంట.