ఏసీలో హాయిగా ఉందనుకుంటున్నారా.? 

Narender Vaitla

13 Aug 2024

రాత్రంతా ఏసీ ఆన్‌చేసుకొని పడుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఏసీలు గాలిలోని తేమను తొలగిస్తుందని తెలిసిందే. ఈ కారణంగా కండ్లు పొడిబరతాయి. ఈ కారణంగా కండ్లలో దురదతో పాటు అసౌకర్యం ఏర్పడుతుంది.

 ఏసీలో పడుకున్నప్పుడు హాయిగా నిద్ర పడుతుండొచ్చు. కానీ శరీరంలో క్రియలు నెమ్మదిస్తాయి. ఈ కారణంగా అలసట, మత్తు వంటి లక్షణాలు రోజంతా ఉంటాయి.

ఏసీలో ఉండే వారికి ఎదురయ్యే మరో ప్రధాన సమస్య డీ హైడ్రేషన్‌. ఏసీ కారణంగా గదిలోని తేమ వేగంగా తగ్గుతుంది. దీంతో డీహైడ్రేషన్‌ బారిన పడే అవకాశం పెరుగుతుంది.

ఏసీలో ఎక్కువగా సేపు ఉన్న వారికి చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మం పొడిబారడం, పొలుసులుగా మారుతాయని అంటున్నారు.

ఏసీలో ఎక్కువ సేపు గడిపే వారిలో నిత్యం తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. చల్లటి గాలి కారనంగా సైనస్‌ వంటి సమస్యలు పుట్టుకొస్తాయి.

ఏసీలో గంటలతరబడి ఉండే వారిలో శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఆస్తమా, అలర్జీల బారిన పడే అవకాశం ఉంటుంది. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.