నిద్రలేమిని  లైట్ తీసుకోకండి.. 

07 December 2023

కంటి నిండ నిద్రలేకపోతే పలు సమస్యలు తప్పవని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు.

మెదడుకు, శరీరానికి మధ్య సమన్వయం లోపిస్తుందని, దీనివల్ల జీవన ప్రమాణం తగ్గిపోతుందని పలు అధ్యయనాల్లో తేలింది.

నిద్రలేమి కారణంగా బాధపడే వారరిలో దీర్ఘకాలంగా గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక నిద్రలేమితో ఇబ్బందిపడే వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. చిన్నచిన్న విషయాలకే తీవ్రంగా స్పందిస్తుంటారు. 

ఎక్కువకాలం పాటు నిద్రలేమితో బాధపడే మెదడు పనీతీరు దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. నిర్ణయాలు తీసుకునే శక్తి తగ్గుతుందని చెబుతున్నారు. 

నిద్రలేమి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఒత్తిడి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

ఎక్కువకాలం పాటు నిద్రలేమితో సతమతమవుతుంటే.. హైబీపీ తదితర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి నిపుణులు సూచనలు పాటించడమే ఉత్తమం.