చలికి కండరాలు పట్టేస్తున్నాయా.? ఇలా చేయండి.. 

20 December 2023

చలి కాలం కండరాలు పట్టేసినట్లు అవుతాయి. అలాగే కీళ్ల వాపు, నొప్పి వేధిస్తుంటుంది. దీంతో నడవాలన్నా, కింద కూర్చొని లేవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. 

దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే దీనిలో ప్రధాన కారణం మాత్రం నీళ్లు తక్కువగా తాగడమే. చలికాలం నీటిని తక్కువగా తీసుకుంటాం. 

ఈ కారణంగా శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేసే క్రమంలో శరీరం మెగ్నీషియంను కోల్పోతుంది. దీంతో కండరాల నొప్పులు వస్తాయి. 

అందుకే కాలంతో సంబంధం లేకుండా, దాహం వేసినా వేయకోయినా.. మంచి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

కీళ్ల దగ్గర అధికంగా ఉండే ఎలక్ట్రోలైట్స్‌లో ఇబ్బందుల వల్ల కీళ్ల నొప్పులూ వస్తాయి. అందుకే ఈ సమయంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి

ఇక చలికాలంలో వాకింగ్ కచ్చితంగా చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఎండలో నడక వల్ల శరీరంలో వేడి పుట్టి కండరాలు రిలాక్స్‌ అవతాయి

చలికాలంలో విటమిన్‌ డీ ఎక్కువగా లభించే పుట్టగొడుగులు, గుమ్మడి, అవిసె గింజలను భాగం చేసుకోవాలి. అలాగే కాసేపైనా ఎండ తగిలేలా చూసుకోవాలి. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తం.