దంతాలపై మచ్చలకు ఇదే కారణం..
22 January 2024
TV9 Telugu
పళ్ల మీద మచ్చలు ఏర్పడడానికి బ్లాక్ కాఫీ, టీలు ఒక కారణమని చెప్పాలి. రోజులో లెక్కకు మంచి టీ, కాఫీలు తాగే వారు దంతాలు పచ్చగా మారుతాయి.
కార్బొనేటెడ్ ఎనర్జీ డ్రింక్స్ వల్ల కూడా పళ్లపై మచ్చలు ఏర్పాడుతాయి, దంతక్షయానికి దారితీస్తాయి. దీనికి ప్రధాన కారణంగా వీటిలో ఆమ్లత్వం ఎక్కువగా ఉండడమే.
చట్నీలను ఎక్కువగా తీసుకునే వారిలోనూ కూడా పళ్లపై మచ్చలు ఏర్పడుతాయి. ఊరగాయల్లో ఉండే ఆమ్లత్వం.. పళ్ల పైపొర ఎనామిల్‌ను ధ్వంసం చేస్తాయి.
టమాసా సాస్‌ను అధికంగా తీసుకుంటే పళ్లు పచ్చగా మారుతాయి. కాబట్టి వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండడమే మంచిది.
ఇక ద్రాక్ష, దానిమ్మ వంటి తీసుకున్న తర్వాత నోటిని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే.. పళ్ల మీద మచ్చలు అవుతాయి.
పళ్లు పచ్చబడడానికి మరో ప్రధాన కారణం మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు. తిన్న వెంటనే బ్రెష్ చేసుకోవాలని వైద్యులు సూచించేది ఇందుకే.
బీట్ రూట్ ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. అయితే పచ్చి బీట్ రూట్ తిన్న వెంటనే నోటిని నీటితో పుకిలించి ఉంచకపోతే దంతాలపై మచ్చలు ఏర్పాడుతాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..