జుట్టు త్వరగా తెల్లబడొద్దంటే.. కెఫిన్‌ను తక్కవుగా తీసుకోవాలి. ఇది ఐరన్ శోషణపై ప్రభావం చూపుతుంది. ఇది వెంట్రుకల కుదుళ్లను బలహీనపరుస్తుంది. త్వరగా తెల్లబడటానికి దారితీస్తుంది.
ఆల్కహాల్ కూడా జుట్టు తెల్లబడడానికి కారణమవుతుంది. దీని కారణంగా విటమిన్ బి, జింక్, కాపర్ స్థాయిలు తగ్గుతాయి. ఇవన్నీ జుట్టు సమస్యలకు కారణమవుతాయి.
చక్కెర ఎక్కువగా ఉండే ఫుడ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. చక్కెర కొల్లాజెన్‌ను దెబ్బతీస్తుంది, న్యూట్రీషనల్ ఇంబ్యాలెన్స్ కారణంగా బలహీనమైన జుట్టు, ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ కి దారితీస్తుంది.
కూల్ డ్రింక్స్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కూడా జుట్టు తెల్లబడుతుందని నిపునణులు చెబుతున్నారు. పురుషుల్లో బట్టతలకు ఈ డ్రింక్స్ కారణమని పలు అధ్యయనాల్లో వెల్లడయ్యాయి.
ప్రాసెస్ చేసిన స్నాక్స్ చిప్స్ వల్ల శరీరంలో విటమిన్ లోపం ఏర్పడుతుంది. దీంతో చిన్న వయసులోనే తెల్ల జుట్టుకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జంక్ ఫుడ్ తీసుకునే వారిలో కూడా జుట్టు త్వరగా రంగు మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని కొవ్వులు, తక్కువ పోషకాలు వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది.
మితిమీరిన ఉప్పును తీసుకోవడం వల్ల శరీరం హీడ్రేషన్‌కు దారి తీస్తుంది. కాబట్టి ఉప్పును మితంగా తీసుకోవడమే మంచిది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.