అకస్మాత్తుగా చెమటలు పట్టడం గుండెపోటు మొదటి లక్షణమని నిపుణులు చెబుతున్నారు. తరచూ ఇలా జరిగితే వెంటనే అలర్ట్ అవ్వాలని అంటున్నారు.
తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా కూడా ఎక్కువ చెమట పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
కొంత మందిలో శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగినా ఉన్నపలంగా చెమటలు పడుతాయని చెబుతున్నారు.
ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆహారంలో ఉప్పు వాడకాన్ని వీలైనంత వరకు చక్కెర తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ మద్యపానం అలవాటు ఉంటే వీలైనంత వరకు పూర్తిగా మానేయాలని సూచిస్తున్నారు. మద్యపానం బీపీకి తొలి కారణంగా చెప్పొచ్చు.
ఇక అధిక చెమటలు పడితే తీసుకునే ఆహారంలో ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
గ్రీన్ టీ తాగడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. అలాగే రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని కచ్చితంగా తీసుకోవాలని చెబుతున్నారు.
ప్రతీరోజూ తేలికపాటి వ్యాయామాలు చేయడంతో పాటు డీప్ ఫ్రైలు, నూనె పదార్థాలను తీసుకోవడాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.