TV9 Telugu
4 April 2024
ఈ లక్షణాలు కనిపిస్తే..
ఒమెగా3 తగ్గినట్లే.
చర్మం తరచుగా పొడిబారుతుంటే శరీరంలో తగినంతా ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు లేవని అర్థం చేసుకోవాలి. దీర్ఘకాలంగా ఈ సమస్య వేధిస్తే వైద్యులను సంప్రదించాలి.
శరీరంలో సరిపడా ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్లు తగ్గితే జుట్టు ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. దీంతో జుట్టు పొడిబారుతుంది, రాలిపోతుంది.
ఒమెగా3 లోపం కారణంగా కీళ్ల కదిలికలో నొప్పిగా ఉంటుంది. కీళ్ల ఆకృతిని కాపాడడానికి కూడా ఒమెగా3 అవసరం. ఈ సమస్య ఉంటే వెంటనే పరీక్షలు చేసుకోవాలి.
మెదడు ఆరోగ్యంపై కూడా ఒమెగా3 లోపం ప్రభావం చూపుతుంది. ఈ లోపం కారణంగా ఏకాగ్రతతో పనిచేయలేక పోతారు.
నిత్యం నీరసంగా ఉంటున్నా, ఏ పనిపై ఏకాగ్రత చేయలేకపోతున్నా.. మీలో ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్ లోపం ఉన్నట్లే అర్థం చేసుకోవాలిని నిపుణులు చెబుతున్నారు.
ఇక తరచూ మూడ్ మారుతున్నా, కోపం, చిరాకు వంటివి వేధిస్తున్నా ఒమెగా3 లోపం కారణంగా చెప్పవచ్చు. దీర్ఘకాలంగా ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ లోపం కారణంగా రోగ నిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలంగా గాయాలు మానకపోతే పరీక్షలు చేయించుకోవడం మంచిది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..