రోజంతా ఉషారుగా ఉండేందుకు.. జపనీయులు చెప్పిన టిప్స్‌ ఇవే. 

03 January 2023

ప్రస్తుతం శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోతోంది. అయితే కచ్చితంగా వాకింగ్‌ కానీ చిన్నచిన్న వ్యాయామాలు చేయడం వల్ల రోజంతా ఎనర్జీతో ఉండొచ్చు. 

రోజంతా ఎనర్జీతో ఉండడానికి జపనీయులు చెబుతోన్న మరో సీక్రెట్‌ గ్రీన్‌ టీ. ప్రతీరోజూ క్రమంతప్పకుండా గ్రీన్‌ టీ తీసుకుంటే ఎనర్జీగా ఉండొచ్చని చెబుతున్నారు. 

ఇక రోజంగతా ఉషారుగా ఉండాలంటే కచ్చితంగా తగినంత నిద్ర ఉండాలని జపనీయులు చెబుతున్నారు. రాత్రి మంచి నిద్ర ఉంటే ఉదయమంతా ఎనర్జీతో ఉండొచ్చని అంటున్నారు. 

జపనీయలు తప్పకుండా పాటించే వాటిలో నీరు తాగడం ఒకటి. వీరు శరీరం డీ హైడ్రేషన్‌ కాకుండా చూసుకుంటారు. నిత్యం తగినంత నీరు తాగాలని చెబుతున్నారు. 

ఇక అప్పుడప్పుడు చెరువులు, సరస్సుల వద్ద స్నానం చేయాలని జపనీయులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. 

వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా జపనీయులు వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయిస్తారు. అప్పుడప్పుడు పని నుంచి బ్రేక్‌ తీసుకుంటూ కుటుంబసభ్యులతో గడపాలని చెబుతున్నారు.

సానుకూల దృక్పథంతో ఉండడం కూడా జీవన విధానంపై ప్రభావం చూపుతుందని జపనీయులు విశ్వసిస్తుంటారు. వీలైనంత వరకు పాజిటివ్‌ ఆటిట్యూడ్‌తో ఉండాలని సూచిస్తున్నారు.