పిస్తాపప్పులు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

Samatha

2 august  2025

Credit: Instagram

పిస్తాపప్పులు కొందరు ఇష్టంగా తింటే మరికొందరు అసలు తినడానికి ఇష్టపడరు. కానీ వీటిని తినడం వలన బోలెడు లాభాలు ఉన్నాయంట.

పిస్తా పప్పులను ప్రతి రోజూ తినడం వలన ఇవి  రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి, టైప్ 2 డయాబెటీస్ ను తగ్గిస్తుంది.

బరువు నియంత్రణకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులో ఉంటే ఫైబర్, ప్రోటీన్ బరువును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

పిస్తాపప్పుల్లో అసంతృప్త కొవ్వులు , మొక్కల స్టెరాయిడ్స్ తో నిండి ఉండటం వలన ఇవి మంచి కొలెస్ట్రాల్ పెంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

పిస్తాపప్పుల్లో యాంటీ ఆక్సిడెంట్స్  , లుటీన్, జియాక్సంతిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

పిస్తా పప్పులను ప్రతి రోజూ తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, ఇది మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.

పిస్తాపప్పులను మీ డైట్ లో చేర్చుకోవడం వలన ఇందులో ఉండే ఎండోథెలియల్ పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది.

వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్స్, సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుందంట.