మెట్లు ఎక్కడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అందుకే లిఫ్ట్ అందుబాటులో ఉన్నా మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.
గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే కచ్చితంగా మెట్లు ఎక్కాలని నిపుణులు సూచిస్తున్నారు. మెట్లు ఎక్కడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఇక మెట్లు ఎక్కడం వల్ల ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ను మరింత వేగంగా తీసుకుంటుంది. దీంతో ఊపిరితిత్తుల సమస్యలు దరిచేరవు.
బరువు తగ్గడంలోనూ మెట్లు ఎక్కడం కీలక పాత్ర పోషిస్తుంది. క్యాలరీలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గొచ్చు.
మెట్లు ఎక్కడం వల్ల శరీర కండరాలకు తగినంత శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కాళ్ల కండరాలు బలవంతంగా మారుతాయి.
మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా మెట్లు ఎక్కడం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తప్రసరణ పెరగడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగవుతోంది.
మెట్లు ఎక్కడాన్ని నిత్యం అలవాటుగా మార్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయి తగ్గిస్తుంది. దీంతో డయాబెటిస్ ప్రమాదం బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.
వారంలో కనీసం 20 మెట్లు ఎక్కితే ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక బరువున్న వారు మెట్లు ఎక్కితే ఇబ్బంది వస్తుందని నిపుణులు చెబుతున్నారు.