18 september 2023
నోటి ఆరోగ్యాన్ని రక్షించడంలో బ్లాక్ టీ ముఖ్యపాత్ర పోషిస్తుంది. నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని బ్లాక్ టీతో చెక్ పెట్టొచ్చు. దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నిరోధిస్తుంది.
బ్లాక్‌టీలో కెఫిన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. బ్లాక్‌టీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ సరిగ్గా జరిగ్గి, ఒత్తిడిని తగ్గిస్తుంది.
బ్లాక్ టీని తాగడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే టానిన్ పధార్థాల వల్ల జలుబు, ఫ్లూ, విరేచనాలు వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. వైరస్‌లను ఎదుర్కునే శక్తి పెరుగుతుంది.
పరిశోధకులు నిర్వహించిన కొన్ని పరిశోధనల ఆధారంగా బ్లాక్ టీ హృద్రోగ సమస్యలకు పరిష్కారం చూపుతుందని చెబుతున్నారు. రక్తప్రసరణలో కలిగే అడ్డంకులను తొలగించడంలో బ్లాక్ టీ ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్‌కు చెక్ పెట్టడంలో క్యాన్సర్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. బ్లాక్ టీలోని పాలిఫేనోల్స్ వంటి అనామ్లజనకాలు ప్రొస్టేట్, లంగ్స్, మూత్రాశయం వంటి క్యాన్సర్‌లు రాకుండా చూస్తాయి.
శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగించడంలో బ్లాక్ టీ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరంలో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు దరి చేరకుండా చూడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఇందుకు ఉపయోగపడతాయి.
బరువు తగ్గడంలో కూడా బ్లాక్ టీ ముఖ్యపాత్ర పోషిస్తుంది. బ్లాక్‌టీలో కేలరీలు, సోడియం తక్కువగా ఉంటుంది. శరీరంలో ఉన్న అదనపు కేలరీలను తగ్గిచడంలో బ్లాక్ టీ ఉపయోగడపడుతుంది. జీవక్రియ కార్యకలాపాలు పెంచడంతో పాటు బరవు కోల్పోవడంలో సహాయపడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా వైద్యులను సంప్రదించి తీసుకోవడమే ఉత్తమం.