కలబంద చేసే మ్యాజిక్ ఇదే.. దీంతో ఎన్ని ప్రయోజనాలో..

Samatha

2 august  2025

Credit: Instagram

ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ఉండే మొక్కల్లో కలబంద మొక్క ఒకటి. ఇది చూడటానికి చాలా చిన్నగా కనిపించినప్పటికీ దీంతో బోలెడు లాభాలు ఉన్నాయంట.

కలబంద మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అందువలన దీనిని ఎన్నో విధాలు గా ఉపయోగిస్తుంటారు.

కీల్ల నొప్పులు, చర్మ సమస్యలకు, శరీరంలోని వేడి తగ్గడానికి, ఆరోగ్యం కోసం, బ్యూటీ కోసం ఇలా ఎన్నో రకాలుగా దీనిని ఉపయోగిస్తారు.

కాగా, అసలు కలబందను తీసుకోవడం  వలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో,  ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

కలబందను ఇంటి ఆవరణంలో పెంచుకోవడం వలన ఇది గాలిలోని విషపదార్థాలను తొలిగించి, గాలిని శుద్ధి చేసి మంచి నిద్రను ప్రేరేపిస్తుంది.

కలబంద గుజ్జును వారానికి రెండు సార్లు జుట్టుకు అప్లై చేయడం వలన ఇది జుట్టును కుదళ్ల నుంచి బలంగా చేయడమే కాకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

కలబంద గుజ్జులో చిటికెడు పసుపు వేసుకొని దానిని ముఖానికి అప్లై చేయడం వలన నల్లటి మచ్చలు పోయి, ముఖం నిగారింపుగా తయారవుతుంది.

అలాగే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, కలబంద గుజ్జులో కాస్త చక్కెర వేసుకొని తినడం వలన ఇది శరీరంలో వేడిని తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడుతుంది.