బక్కగా ఉన్నారా..లావు అవ్వాలంటే తప్పక తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే!

Samatha

30 July  2025

Credit: Instagram

చాలా మంది బక్కగా ఉన్నాం అని బాధ పడుతుంటారు. త్వరగా లావు ఎలా అవ్వాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలో అని తెగ ఆలోచిస్తుంటారు.

కాగా, బక్కపలచగా ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవడం వలన వేగంగా బరువు పెరుగుతారో ఇప్పుడు చూద్దాం.

బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే రోజూ కనీసం నాలుగు నుంచి ఆరు బాదం పప్పులు తినడ వలన త్వరగా లావు అవుతారంట.

ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అంతే కాకుండా ఫైబర్ ఉంటుంది. అందువలన కనీసం నెల రోజుల పాటు క్రమం తప్పకుండా బాదం తీసుకోవడం చాలా మంచిదంట.

అలాగే త్వరగా వేగంగా బరువు పెరగాలి అనుకునేవారు, ప్రతి రోజూ ఒకటి ఉడకబెట్టిన కోడి గుడ్డు తినాలంట. దీని వలన వేగంగా బరువు పెరుగుతారంట.

గుడ్లలో మెగ్నీషియం, సోడియం, పొటాషియం, వంటి పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని రోజూ ఒకటి తప్పక తినాలంట.

పచ్చి కొబ్బరి పాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కేలరీలు, ఫైబర్, వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి.

అందువలన సన్నగా ఉన్నవారు మీ డైట్‌లో కొబ్బరి పాలు చేర్చుకోవడం చాలా మంచిదంట. దీని  వలన చాలా త్వరగా లావు అవుతారంట.