గుండెకు ఇవే శత్రువులు.. 

14 January 2024

TV9 Telugu

గుండె మెరుగ్గా పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. గుండె పనితీరులో ఏమాత్రం తేడా ఉన్నా అది వెంటనే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. 

అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని టిప్స్‌ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ టిప్స్‌ ఏంటి...? గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే. 

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పును వీలైనంత వరకు తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు తినే వారికి బీపీనే కాకుండా, గుండె ఆరోగ్యం దెబ్బతింటోందని చెబుతున్నారు

చక్కెర ఎక్కువగా తీసుకోవడం కూడా గుండె ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. విపరీతంగా స్వీట్లు తినడం వల్ల గుండె ఆరోగ్యం పాడవుతుందని హెచ్చరిస్తున్నారు. 

నూనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నూనెతో కొలెస్ట్రాల్‌ పెరిగి, గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. 

రెడ్‌ మీట్‌ అధికంగా తీసుకున్న గుండె ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తరచూ మాంసాహారం తినే వారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. 

తగినంత శారీర వ్యాయామం లేకపోయిన గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజూ వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. 

పైన తెలిపి విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.