07 July  2024

శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? 

Narender.Vaitla

ఎక్కువ రోజులపాటు నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే కిడ్నీల పనితీరు దెబ్బతిందని అర్థం చేసుకోవాలి. కిడ్నీలు ఫిల్టర్‌ చేయని సమయంలో టాక్సిన్స్‌ రక్తంలో చేరుతాయి. దీంతో నిద్ర భంగం ఏర్పడుతుంది.

తరచుగా మూత్రంలో రక్తం రావడం కూడా కిడ్నీల పనితీరు దెబ్బతిందని చెప్పడానికి కారణంగా చెప్పొచ్చు. మూతంలో నురగ రావడం కూడా దీనికి కారణం కావొచ్చని నిపుణులు అంటున్నారు.

కిడ్నీల పనితీరు దెబ్బతింటే చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

కళ్ల చుట్టూ ఉబ్బినట్లు కనిపించినా కిడ్నీ ఫెయిల్యూర్‌ కారణమని నిపుణులు చెబుతున్నారు. మంచి నిద్ర ఉన్నా కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

అరికాళ్లలో వాపు కనిపించినా కిడ్నీ ఫెయిల్యూయర్‌గా భావించాలి. శరీరంలో నీటి శాతం పెరగడం కారణంగా అరికాళ్లు ఉబ్బుతాయి.

రాత్రుళ్లు ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తే షుగర్‌ లక్షణంగా భావిస్తాం. కానీ కిడ్నీ సమస్యలు ఉన్నా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మూత్రం రంగు ఒక్కసారిగా మారినా కిడ్నీల పనితీరు దెబ్బతిందని అర్థం చేసుకోవాలి. మూత్ర పిండాలు దెబ్బతింటే మూత్రం ముదురు రంగులో వస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.