ఈ లక్షణాలున్నాయా.? షుగర్‌ వ్యాధి వస్తున్నట్లే 

17 August 2023

మధుమేహం వచ్చే ముందు నోటిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి ముఖ్యంగా నోటి దుర్వాస వేధిస్తుంది, చిగుళ్ల వ్యాధి కనిపిస్తుంది. అలాగే నోరంతా దెబ్బ తింటుంది.

ఇక మధుమేహానికి మరో ముందస్తు సూచన మూత్రం తరచుగా రావడం, శరీరంలో పెరిగిన షుగర్ లెవెల్స్ తట్టుకోలేకే, శరీరం అధికంగా మూత్ర విసర్జన చేస్తుంది.

మధుమేహం ఎంటర్ అయితే రోగ నిరోధ శక్తి తగ్గుతుంది. దీంతో తరచుగా జ్వరం, స్కిన్‌ మీద రాషెస్‌ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఎలాంటి శ్రమ లేకపోయినా, నీరసం వచ్చినట్లు ఉంటుంది. ఇలా అనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. మధుమేహం లక్షణం కావొచ్చు. 

మధుమేహం ముందస్తుగానే గుర్తించే మరో లక్షణం విపరీతమైన దాహం. సాధారణం కంటే ఎక్కువ దాహం వేస్తే మధుమేహంగా అనుమానించాలి. 

ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉన్నపలంగా బరువు తగ్గితే అలర్ట్ అవ్వాలి. ఇది కూడా మధుమేహం ముందస్తు లక్షణం కావొచ్చు. 

భోజనం చేసిన కొద్ది సేపటికే ఆకలి వేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇలా అనిపించినా మధుమేహం లక్షణంగా భావించాలి. 

 మధుమేహం మరో ముందస్తు లక్షణం.. చేతులు, కాళ్లలో జలదరింపు, తిమ్మిరిగా ఉండడం. రక్తంలో చక్కెర పెరిగితే ఇలాంటి లక్షణం కనిపిస్తుంది.