పెంపుడు తల్లిదండ్రులతో పెరిగే పక్షులు ఏవో తెలుసా?

Samatha

30 August  2025

Credit: Instagram

ప్రకృతిని సరిగ్గా పరిశీలిస్తే అది మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. ఎన్నో గొప్ప విషయాలను తనలోనే దాచుకొని నిశ్శబ్ధంగా ఉంటుంది.

అయితే, మనం చూస్తుంటాం, పుట్టిన తర్వాత ప్రతి జీవి తమ తల్లిదండ్రుల వద్ద ఆనందంగా జీవించాలనుకుంటుంది. కానీ కొన్నిసార్లు అలా జరగకపోవచ్చు.

ఇక ఏ తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే వారి దగ్గర పెంచడానికి ఇష్టపడరు, అలాగే పిల్లలు వారి తల్లిదండ్రులను విడిచి పెట్టి ఉండలేరు, కానీ కొన్ని పక్షులు మాత్రం తమ తల్లిదండ్రులను కూడా కలవలేవంట.

కొన్ని పక్షులు పుట్టిన తర్వాత తమ తల్లిదండ్రులను కూడా కలవలేవు, పెంపుడు తల్లిదండ్రులతోనే అవి జీవిస్తాయంట. ఇంతకీ ఆ పక్షులు ఏవి అంటే?

బ్రూడ్ పరాన్న జీవి , ఈ పక్షులు గుడ్లను ఇతర గూళ్లలో పెడతాయంట. అంతే కాకుండా అవి తమ పిల్లలను పెంచమని ఇతర పక్షులను కోరుకుంటాయంట.

కోకిల పక్షులు, ఈ పక్షులు చాలా మోసపూరిత పక్షులు . ఎందుకంటే, ఇవి ఇతర గూళ్లలో గుడ్లు పెట్టి, వాటి పిల్లలను తెలియని వారి వద్ద పెంచుతాయంట.

కౌబర్డ్స్, ఇవి ఇతర పక్షుల గూళ్లలో గుడ్లు పెట్టడానికి ఇష్టపడవంట. కానీ ఇవి తమ తోబుట్టువుల వద్ద పిల్లలను పెంచడానికి ఇష్టపడుతాయంట.

కొన్ని ఫించ్‌లు రహస్యంగా సంబంధింత జాతుల గూళ్లలో గుడ్లు పెడతాయంట. తద్వారా అవి వాటి పెంపుడు జుంతువుల సమక్షంలో పెరుగుతాయి.