ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సొరంగలు తవ్వుతారు. వీటిని ప్రయాణం కోసం లేదా గనులు కోసం ఉపయోగిస్తారు.
అయితే కొన్ని సార్లు వీటిలో ప్రయాణం చేసినప్పుడు, పని చేసినప్పుడు ప్రమాదాలు కారణంగా కొంతమంది అందులో చిక్కుకుంటారు.
SLBC టన్నెల్ ప్రమాద ఘటనలో సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రమాదాలు చాలా జరిగాయి.
జనవరి 2025లో అసోంలో డిమా హసావో జిల్లాలోని ఉమ్రాంగ్సో ప్రాంతంలోని బొగ్గు గనిలో వరదలు రావడంతో తొమ్మిది మంది కార్మికులు గల్లంతు.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ టన్నెల్‌లో 2023 నవంబర్ 12న సొరంగం పనులు చేసేందుకు వెళ్లి 41 మంది కార్మికులు గల్లంతు.
ఉత్తరకాశీ టన్నెల్‌లో ర్యాట్‌హోల్ నింగ్ టెక్నిక్ సాయంతో 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
నవంబర్ 2022లో హిమాచల్ ప్రదేశ్ మండి హైవే నిర్మాణంలో భాగంగా తవ్వుతుండగా కుప్పకూలిన సొరంగం. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. 60 మంది కార్మికులు క్షేమం.
2018లో, భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తర థాయ్‌లాండ్‌లోని థామ్ లుయాంగ్ ఫ్రాంగ్ నాంగ్ గుహలో చిక్కుకున్న 12మంది జూనియర్ అసోసియేషన్ ఫుట్‌బాల్ జట్టు. చాకచక్యంగా కాపాడిన రెస్క్యూ టీమ్.