28 February 2024

ఒత్తిడితో చిత్తవుతున్నారా.? ఈ ఆహారం తీసుకోండి.. 

TV9 Telugu

ఒత్తిడిని దూరం చేయడంలో బొప్పాయి ఉపయోగపడుతుంది. ఇందులో కెరోటిన్‌ విషతుల్యాల్ని బయటకు పంపుతుంది. దీంతో శరీరం, మనసు తేలికపడి ఒత్తిడి తగ్గుతుంది.

ఒత్తిడి దూరం చేయడంలో ఆరంజ్‌ ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్‌ సి ఒత్తిడిని పెంచే హార్మోన్లను నియంత్రిస్తుంది. 

అరటి పండు కూడా ఒత్తడిని తగ్గించడంలో ఉపయోపడుతుంది. ఇందులో మెగ్నీషియం ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే  మెరుగైన జీర్ణక్రియ సొంతమవుతుంది.

ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోపడే మరో ముఖ్యమైన ఆహారం ఆలుగడ్డ. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్‌ సితో ఒత్తిడి దూరమవుతుంది.

ఇక చాక్లెట్లు కూడా ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫెనిలెథిలమైన్‌ ఎండార్ఫిన్‌ స్థాయిల్ని తగ్గించి సహజసిద్దమైన యాంటీ–డిప్రెషన్‌గా పనిచేస్తుంది.

పెరుగుకు కూడా ఒత్తిడిని చిత్తు చేయడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్‌ బి ఒత్తిడిని బలదూరు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

చేపలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మంచి యాంటీ స్ట్రెస్‌ ఏజెంట్‌గా ఉపయోపడుతుంది. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.