చిన్నారుల్లో పరీక్షల ఒత్తిడా.? ఇవి తినిపించండి.. 

TV9 Telugu

25 February  2024

చిన్నారుల్లో ఒత్తిడి దూరం చేయడంలో వాల్‌నట్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. వీటివల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు, ఒత్తిడి కూడా తగ్గుతుంది.

గుడ్లలో ప్రోటీన్స్‌, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఏకాగ్రతను, శ్రద్ధను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. చిన్నారులకు రోజుకో గుడ్డును ఇవ్వడం అలవాటు చేయాలి.

చేపల్లోనే ఒమెగా 3 ఫ్యాట్స్‌, జింక్‌ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. చిన్నారులకు పరీక్ష సమయంలో చేపలు ఇస్తే జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు ఒత్తిడి కూడా దూరమవుతుంది.

ఎదిగే పిల్లల్లో ఆకుకూరలు ఎంతగానో ఉపయోగపడుతాయి. ముఖ్యంగా ఆకు కూరల్లో ఉండే విటమిన్‌ ఈ, కే వంటి పోషకాలు అలాగే గ్లూకోసినోలేట్స్‌ అనే సమ్మేళనం శరీరంలోని ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది.

మెదడు పనితీరును మెరుగుపరచడంలో నట్స్‌ కీలక పాత్రలు పోషిస్తాయి. వీటిలోని ఎన్నో పోషకాలు పిల్లల్లో కలిగే మానసిక కల్లోలాలను నియంత్రిస్తాయి. జ్ఞాపకశక్తి మెరుగువుతుంది. 

సిట్రస్‌ పండ్లు మెదడు చురుగ్గా పనిచేసేందుకు దోహదపడతాయి. ముఖ్యంగా ఇందులో పుష్కలంగా లభించే విటమిన్‌ సి జ్ఞాపకశక్తి పెరగడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

బెర్రీ జాతికి చెందిన పండ్లు కూడా మెదడుకు మంచి ఆహారంగా చెప్పొచ్చు. ఇందులోని యాంథోసైనిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మెదడులో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.