60లోనూ 30లా.. వృద్ధాప్యానికి చెక్‌పెట్టే ఫుడ్‌.

20 November 2023

ఆహారంలో కూరగాయలను భాగం చేసుకోవాలి. క్రమం తప్పకుండా కూరగాయలు తీసుకునే వారిలో వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా కనిపించవు. పాలకూర, బచ్చలి కూరను క్రమంతప్పకుండా తీసుకోవాలి. 

వృద్ధాప్యాన్ని దరిచేరకుండా ఆపడంలో చేపలు మంచి ఆహారంగా ఉపయోగపడతాయి. చేపలు శరీరంలో కొల్లాజెన్‌ స్థాయిలను పెంచుతాయి. దీంతో మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 

గుడ్లు కూడా మంచి యాంటీ ఏజింగ్‌ ఫుడ్‌లా ఉపయోగపడుతాయి. ఇందులోని పోషకాలు కూడా కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచుతాయి.

బెర్రీస్‌కు వృద్ధాప్య ఛాయలను దరిచేరకుండా ఆపుతాయి. బెర్రీస్‌లో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

కొల్లాజెన్ ఉత్పత్తికి ఉపయోగపడే అమైనో ఆమ్లాలు బీన్స్‌లో సమృద్ధిగా ఉంటాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

ఇక వృద్ధాప్య ఛాయలు త్వరగా రావడానికి చక్కెర ఒక కారణంగా చెప్పొచ్చు. చక్కెరను అధికంగా తీసుకుంటే చర్మ సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

సోడా, కాఫీలకు దూరంగా ఉండాలి. ఇవి చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుంది. నిద్రలేమికి కూడా కారణమవుతుంది. దీంతో త్వరగా వృద్ధాప్య చాయలు వస్తాయి.

ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకునే వారిలో కూడా త్వరగా వృద్ధాప్య చాయలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొల్లాజెన్‌ లేమికి ఆల్కహాల్ దారి తీస్తుందని అంటున్నారు.