28 July  2024

వయసు తగ్గాలని ఆశ పడుతున్నారా.? 

చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిచడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. తరచూ ఆహారంలో నెయ్యిని భాగం చేసుకోవడం వల్ల చర్మం డిటాక్స్‌ అయ్యి ముఖంలో గ్లో పెరుగుతుంది. ముడతలు దూరమవుతాయి.

వృద్ధాప్య లక్షణాలను దూరం చేయడంలో బ్లూబెర్రీస్‌ కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలోని విటమిన్ సి, ఈలు యాంటీ ఏజింగ్‌గా పని చేసి వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వకుండా ఉంటాయి. 

తీసుకునే ఆహారంలో ఆకు కూరలను భాగం చేసుకోవడం వల్ల వృద్ధాప్య లక్షణాలు తగ్గించుకోవచ్చు. వీటిలో ఉండే మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ వంటివి చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు సహాయపడతాయి.

అవకాడో చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవకాడోలో ఉండే విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్ ఈ యాంటీ ఏజింగ్ ఏజెంట్స్‌గా ఉపయోగపడతాయి.

బొప్పాయిలో ఉండే విటమిన్లు, మినరళ్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వీటిలోని కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం చర్మం సాగే లక్షణాన్ని తగ్గిస్తుంది.

వృద్ధాప్య ఛాయల్ని తగ్గించడంలో ఎర్ర క్యాప్సికం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సూర్యరశ్మి వల్ల వచ్చే దుష్రభావాల నుంచి రక్షిస్తాయి.

తీసుకునే ఆహారంలో చేపలను భాగం చేసుకోవడం వల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ చర్మాన్ని మృదువుగా, తేమగా చేయడంలో ఉపయోగపతాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.