టెన్షన్‌గా ఉందా? ఇలా రిలాక్స్‌ అవ్వండి..

29 November 2023

పని ఒత్తిడి, ఉరుకుల పరుగుల జీవితం కారణంగా నేటి యువత టెన్షన్‌తో సతమతమవుతున్నారు. దీంతో అనేక రోగాలు వారిని చుట్టుముడుతున్నాయి

టెన్షన్‌ అనిపించినప్పుడల్లా దాన్నుంచి ఉపశమనం పొందడానికి గట్టిగా గాలి పీల్చి వదలడం మనలో చాలామంది చేసేదే.. అలాగే అంకెలు కూడా లెక్కపెట్టమని సలహా నిపుణులు ఇస్తున్నారు

గట్టిగా గాలి పీల్చే క్రమంలో ముందుగా మూడంకెలు లెక్కపెట్టండి.. మరో మూడంకెలు లెక్కపెట్టే దాకా గాలిని అలాగే నిలిపి ఉంచండి.. ఆపై వదిలే క్రమంలో కూడా మరోసారి మూడంకెలు లెక్కపెట్టండి..

ఇలా మీరు కూర్చున్న చోటే ఓ పది సార్లు చేశారంటే ఎలాంటి టెన్షన్‌ అయినా పరార్‌ అయిపోవాల్సిందే! ఇలా లెక్కించే క్రమంలో ఏకాగ్రత పెరిగి మనసు ప్రశాంతంగా ఉంటుంది 

టెన్షన్‌ పడుతున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. అయితే గాలి పీల్చి వదిలే క్రమంలో ఈ వేగం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. తద్వారా టెన్షన్‌ కూడా తగ్గుతుంది

కొన్ని రంగులు మన మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయని సైన్స్‌ చెబుతోంది. ముఖ్యంగా ముదురు వర్ణాల కంటే లేత రంగులను కాసేపు చూస్తే మానసికంగా, ఎమోషనల్‌గా, శారీరకంగా రిలాక్సవుతామట

ఇంటి గోడలకు లేత వర్ణాలతో పెయింట్‌ చేసుకోవడం, ఆఫీస్‌ గదిలో లేత రంగుల్లో చిత్రీకరించిన అందమైన పెయింటింగ్స్‌, బొమ్మలు వంటివి అమర్చుకుని టెన్షన్‌గా అనిపించినప్పుడల్లా వాటిని చూస్తే ఇట్టే రిలాక్స్‌ అవ్వొచ్చు

బాగా టెన్షన్‌లో ఉన్నప్పుడు మంచి సువాసనలు ముక్కును తాకితే వెంటనే మన మనసు దాని వైపు మళ్లుతుంది. అలా సువాసనలకు కూడా మనలోని ఒత్తిళ్లను దూరం చేసే చేస్తాయి. దీన్ని అరోమా థెరపీ అంటారు