మీరూ మస్కారా రోజూ వాడుతున్నారా?

02 November 2023

కనురెప్పల అందాన్ని రెట్టింపు చేసేందుకు మగువలు మస్కారా వాడుతుంటారు. అయితే రోజూ దీన్ని వాడటం వల్ల ఇందులోని రసాయనాలు కనురెప్పల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి

కనురెప్పలకు మస్కారా వాడాల్సి వస్తే తప్పనసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం

కనురెప్పలకు పోషణ అందించడానికి, అవి పొడిబారకుండా చేయడానికి మస్కారా వల్ల పెట్టుకునే ముందు మస్కారా ప్రైమర్‌ అప్లై చేసుకోవాలి 

ఇలా చేయడం వల్ల రెప్పలు ఒత్తుగా, అందంగా కనిపిస్తాయి. మస్కారాను ఫార్మాల్డిహైడ్‌, సింథటిక్‌ వంటి రసాయనాలతో తయారుచేస్తే, అటువంటి వాటిని అస్సలు వాడకూడదు

మస్కారాను ప్రతి ఆరు నెలలకోసారి మార్చలని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. కొనే ముందే అవి ఎప్పుడు తయారయ్యాయి, వాటి గడువు తేదీ వంటి వివరాలు సరిచూసుకోవాలి

కనురెప్పలు ఒత్తుగా పెరగాలంటే, మస్కారా ప్రభావం కళ్లపై పడకుండా ఉండాలంటే రోజు వారి ఆహార పద్ధతుల్లోనూ కొన్ని పలు మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు

ముఖ్యంగా విటమిన్‌ ‘డి’, ‘ఇ’ అధికంగా లభించే చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు వంటి ఆహారాలను అధికంగా తీసుకోవాలి

మస్కారా కండిషనర్లు వాడటం వల్ల కనురెప్పల్ని తేమగా ఉంచడానికి, ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు తొలగించుకోవడం మర్చిపోకూడదు