15 June 2024

నడుం నొప్పికి ఇవి కూడా కారణాలు.. 

Narender.Vaitla

నడిచే తీరు సరిగ్గా లేకపోయినా నడుం నొప్పికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. నడుస్తున్న సమయంలో పాదాల తీరు సరిగ్గా లేకపోతే నడుం నొప్పి వస్తుంది. నడుస్తున్నప్పుడు నడుం నొప్పి తలెత్తితే పాదం సమస్యలున్నాయా చూసుకోవాలి.

నిద్రలేమి కూడా నడుం నొప్పికి దారతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు నిద్రలేమి సమస్య ఉండే వారికి నడుం నొప్పి వచ్చే అవకాశం 1.5 రెట్లు ఎక్కువని ఒక అధ్యయనం చెబతోంది.

గంటల తరబడి ఒకేచోట కూర్చొవడం వల్ల కూడా నడుం నొప్పి వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సరైన పొజిషన్‌లో కూర్చోవడం వల్ల నడుం నొప్పి సమస్య వస్తుంది.

స్మోకింగ్ చేసే వారిలో కూడా నడుం నొప్పి సమస్య ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. పొగాకుతో కణజాలాలకు, ఎముకలకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల వెన్నుపూసల మధ్య ఉండే గట్టి రబ్బరు లాంటి డిస్కులు క్షీణిస్తాయని చెబుతున్నారు.

మన హైట్‌ కూడా నడుం నొప్పికి దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. పొట్టి వారితో పోలిస్తే ఎత్తు ఎక్కువగా ఉండే మహిళల్లో నడుం నొప్పి వచ్చే అవకాశాలు 20 శాతం ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.

టైట్ ప్యాంట్లు ధరించడం వల్ల కూడా నడుం నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయని పలు అధ్యయనాల్లో తేలింది. వీటివల్ల నడుం కింది భాగంతో ఒత్తిడి పెరుగుతుంది, ఈ సమయంలో కూర్చుంటే నడుంపై ఒత్తిడి పెరుగుతుంది.

బ్యాక్‌ ప్యాకేట్‌లో పెట్టుకునే పర్సులు కూడా నడుం నొప్పికి కారణమవుతాయని మీకు తెలుసా.? ముఖ్యంగా లావుగా ఉండే పర్సు వెనకాల పెట్టుకుంటే కండరాలపై ఒత్తిడి పెరిగి నడుం నొప్పికి దారి తీస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.